Budget 2025 | కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. అత్యధికంగా పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5936 కోట్లను కేటాయించింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన దానితో పోలిస్తే ఇది 400 కోట్లు అధికం. ఇది కాకుండా పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లను కేటాయించింది. వీటితో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు ఇలా ఏపీకి పలు కేటాయింపులు జరిగాయి.
బడ్జెట్లో ఏపీ కేటాయింపులు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375కోట్లు
రాష్ట్రంలోని రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.240 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు