Udit Narayan Kiss Contravesry | బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) ఈరోజు ఉదయం నుంచి వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే. తన మ్యూజిక్ కన్సర్ట్లో భాగంగా.. మహిళ అభిమానులకు పెదవులపై ముద్దు పెట్టడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఘటనలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అనుమతి లేకుండా అలా ఎలా ముద్దు పెడతాడని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం ముదురుతుండటంతో తాజాగా దీనిపై స్పందించారు ఉదిత్ నారాయణ్.
ఆయన మాట్లాడుతూ.. మహిళ అభిమానులకు నేనంటే చాలా ఇష్టం. కొంతమంది నాకు షేక్ హ్యండ్ ఇస్తే.. మరికొంతమంది హగ్ ఇవ్వడానికి.. ఇంకొంతమంది కిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు అలా చేసినప్పుడు నేను కూడా వారిపై నాకున్న ప్రేమను తెలియజేయడానికే ఇలా చేస్తాను. ఇందులో ప్రేమ తప్ప వేరే ఉద్దేశం లేదు. కొంతమంది కావాలనే ఈ విషయాన్ని వివాదం చేస్తున్నారని ఉదిత్ చెప్పుకోచ్చాడు.
ఉదిత్ నారాయణ్(Udit Narayan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన గాత్రంతో బాలీవుడ్ సినిమాలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించాడు. బాలీవుడ్లో వీర్ జారా, జో జీతా వహి సికందర్, స్వదేశ్, దిల్ సే, దిల్ తో పాగల్ తదితర మ్యూజికల్ హిట్లను అందించాడు. తెలుగులో కూడా ఈ సింగర్ ‘అందమైన ప్రేమరాణి’, ‘అందాల ఆడబొమ్మ’, ‘కీరవాణి రాగంలో’, ‘పసిఫిక్లో దూకేమంటే’, ‘అమ్మాయే సన్నగా’ వంటి సూపర్ హిట్ పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025