నార్నూర్ : దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ( Chronic Disease ) చర్యలు తీసుకుంటున్నామని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జితేందర్ రెడ్డి( Jitender Reddy ) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య భద్రత కోసం ముందడుగు వేయండి కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ( Medical Camp ) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు బీపీ, షుగర్ , క్షయ వ్యాధి, హైప టైటిస్, బీఅండ్సీ, సుఖ వ్యాధులు , హెచ్ఐవీ లకు సంబంధించి వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిర్ధారణ అనంతరం బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అపరిశుభ్రత లోపించకుండా చూడాలని, శుభ్రత పాటించడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో తులసీదాస్, హెల్త్ సూపర్వైజర్ చరణ్ దాస్, వైద్య సిబ్బంది నాగరాజు, రంజిత్, దుర్గ ప్రసాద్, ప్రియాంక, ఈశ్వర్, దినేష్, ఆశా కార్యకర్తలు ఉన్నారు.