కాసిపేట, అక్టోబర్ 29 : బైక్ కొనివ్వలేదని మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దిమాడ గ్రామానికి చెందిన ఆదె సాయి కుమార్(20) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు దేవాపూర్ ఎస్ఐ గంగారాం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు..సాయి కుమార్ తన తల్లి గుంగు బాయితో కలిసి దేవాపూర్ మద్దిమాడలో నివాసం ఉంటున్నారు. సాయి కుమార్ స్థానిక మెకానిక్ షాప్ లో పని చేస్తున్నాడు.
గత కొంత కాలంగా బైక్ కొనివ్వాలని కోరుతున్నాడని, మంగళవారం అర్ధ రాత్రి ఇంటికి మద్యం తాగి వచ్చి బైక్ కొనివ్వాలని కోరినట్లు తెలిపారు. నగదు లేదని చెప్పడంతో తల్లిని భయటకు వెళ్లగొట్టి ఇంట్లో పడుకున్నాడు. రేకుల షెడ్డులో భయట పడుకున్న తల్లి బుధవారం ఉదయం లేచి ఇంటి తలుపులు తీయగా తీయకపోవడంతో కిటికిలో నుంచి చూడగా ఉరి వేసుకొని ఉన్నాడు. కేకలు వేయడంతో పక్క ఇంటి వాళ్లు వచ్చి తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు తల్లి గుంగు బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.