తాండూర్, ఆగస్టు 19 : 186వ ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని తాండూర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మేడిపల్లి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు సబ్బని సమ్మన్న, ప్రనధాన కార్యదర్శి పుప్పాల శోభన్, కోశాధికారి రమేశ్, మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎస్కే మోయిన్, పుప్పాల సురేష్, రంజిత్, దుర్గాప్రసాద్, షారూఖ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.