కాసిపేట, నవంబర్ 8 : మంచిర్యాల జిల్లా సోమగూడెం భరత్ కాలనీలోని శిశు మందిర్ క్రీడా మైదానంలో ఆదివారం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ వాలీబాల్ బాల బాలికల జట్ల క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. నిర్వాహకులు భైరగోని సిద్దయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, స్థానిక నాయకులు ముత్తె భూమయ్య వాలీ బాల్ సర్వీసింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.
ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి జట్టులో హైదరాబాద్ మేడ్చల్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరపున ఆడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయి జట్టు క్రీడాల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం గోపాల్, పొన్నాల కనక రాజు, అజ్మీర శ్రీనివాస్, డైకిన్ ఏసీ కంపెనీ ప్రతినిధి రమేష్, వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి గాజుల శ్రీమాన్, కొయ్యాడ శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు విజయ్, రాజేష్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.