దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేట, కన్నేపల్లి, దండేపల్లి గ్రామాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులను స్థానిక ఎస్ఐ తహసినొద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా, తదితర రికార్డులను పరిశీలించారు.
డ్రైవర్, హెల్పర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులో పాఠశాల కాంటాక్ట్ నెంబర్, విండోలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టి కిట్, ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, బస్సుల పై ఉన్న చలాన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల బస్సు డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దన్నారు. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.