కాసిపేట, అక్టోబర్ 7: మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి, సోమగూడెం రహదారి మద్యలోని మధుర జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెల్లంపల్లి వైపు నుంచి సోమగూడెం వైపు ట్రాలీ వస్తుండగా వెనుకాల మరో వాహనం ఎర్టిగా రెండు వాహనాలు వెళ్తుండగా పశువులు అడ్డురావడంతో ట్రాలీ, ఎర్టిగా వెనుకాల వైపు నుంచి ఢీ కొన్నాయి. దీంతో ఎర్టిగా వాహనంలో ఉన్న వారితో పాటు ట్రాలీ లో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరుకు అంబులెన్స్ ద్వారా 108 సిబ్బంది సంపత్, రవి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.