కాసిపేట, అక్టోబర్ 14 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. దేవాపూర్‌లో అదానీ సిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ బాల గిరిధర్, హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ అధికారి తిరుపతి చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేశారు.
అనంతరం దేవాపూర్ ఎస్ఐ గంగారాం చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దండారీ దర్బార్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆడె జంగు, సిడం రాందాస్,పెంద్రం హన్మంతు, సోయం సూరు, ఆత్రం జంగు, మడావి ధర్మారావు, సిడం రాజు, సిడం రమేష్, మడావి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.