జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ్ధిదారులకు రూ 1.16లక్షల విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాదాడి సరోజన, తాసీల్దార్ పుష్పలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గురం రాజారాంరెడ్డి, వైస్ ఎంపీపీ సుతారి వినాయక్, వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, పొనకల్ సింగిల్ విండో చైర్మన్ శీలం రమేశ్, కోఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీశ్, సులువ జనార్దన్, కూడల శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.