100 beds hospital | చెన్నూర్, జూన్ 28 : చెన్నూరు పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల దవాఖాన నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల దవాఖాన నిర్మాణ పనులను శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకునిగా నియోజకవర్గంలోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో చెన్నూర్ పట్టణంలో వంద పడకల దవాఖానను మంజూరు మంజూరు చేయించారని అన్నారు. అలాగే పట్టణంలోని 30 పడగల దవాఖానను మాతా శిశు కేంద్రంగా అప్‌గ్రేడ్ చేసి నూతన భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు సాగాయని తెలిపారు.
అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ 18 నెలల కాలంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని డాక్టర్ రాజా రమేష్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 100 పడకల దవాఖాన నిర్మాణం పనులే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో శరవేగంగా సాగిన వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు కాంగ్రెస్ పాలలో నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి తన కొడుకు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ తెప్పించుకోవడంపై ఉన్న శ్రద్ధ, తనకు మంత్రి పదవి తెప్పించుకునేందుకు ఉన్నంత శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేదని అన్నారు.
మంత్రి వివేక్‌కు ప్రజలపై ఏమైనా శ్రద్ధ ఉంటే వంద పడకల దవాఖాన నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మోతే తిరుపతి, మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణ, మాజీ కౌన్సిలర్లు రేవల్లి మహేష్, జగన్నాధుల శ్రీను, మాజీ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రత్న సమ్మిరెడ్డి, బి బి ఆర్ ఎస్ నాయకులు రామ్ లాల్ గెల్డా, అయితే సురేష్ రెడ్డి, మేడ సురేష్ రెడ్డి, నిన్నల భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం