BRS strike | మంచిర్యాల, మే 06 : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూరు చౌరస్తాలో ధర్నాకు దిగారని తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటలకుపైగా ధర్నా చేపట్టారు. వారి ధర్నాకు అధికార యంత్రాంగం దిగొచ్చింది.
బీఆర్ఎస్ ఉదయం నుంచి చేపట్టిన ఆందోళనతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రాములు మృతుల కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో విరమించారు. లక్సెట్టిపేట మండలం ఉత్కూరు , గంపలపల్లిలలో ఈదురుగాళ్లకు గోడ కూలి ముగ్గురు రైతులు, ఓ విద్యార్థి మృతి చెందారని తెలిసిందే.
బీఆర్ఎస్ ఆందోళనతో దిగివచ్చిన కాంగ్రెస్ సర్కార్!
లక్సెట్టిపేట మండలం ఉత్కూరు ,గంపలపల్లిలలో ఈదురుగాళ్లకు గోడ కూలి మృతి చెందిన ముగ్గురు రైతులు, ఓ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు… https://t.co/qVIqIgoeHB pic.twitter.com/oy1anDP2HA
— BRS Party (@BRSparty) May 6, 2026