మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ లోపల శుక్రవారం అగ్ని ప్రమాదం(Fire accident )జరిగింది. ఎంసీసీలో అద్దెకు ఉంటున్న ఎన్జీ వో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్కేజీఎస్ సంగ్ సంస్థకు సంబంధించిన గొబర్ గ్యాస్ కు వాడే పై కప్పులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో ఆకాశ పొగతో కమ్మివేసింది. సమాచారం అందుకున్న మంచిర్యాల అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ఎంసీసీ క్వార్టర్స్ లో ఓ బిల్డింగ్ ను అద్దెకు తీసుకొని గత ఐదు సంవత్సరాలగా ఇక్కడ నిర్వహణ కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇలాంటి ప్లాస్టిక్ ఫర్నిచర్ నిలువ ఉంచారాదని, ఒకవేళ ఇక్కడ పెట్టాల్సి వస్తే తప్పనిసరిగా వారి అనుమతులు తీసుకొని జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు అగ్నిమాపక సిబ్బంది సూచించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్ మెన్ అరుణ్ కుమార్, డ్రైవర్ ఎంఏ రహీమ్, ఫైర్ మెన్ రాజేందర్, రమేష్, శ్యామ్ సుందర్ మంటలను ఆర్పివేశారు.