కాసిపేట, సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సాలేగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల పాత భవనం కూల్చి వేయాలని ఆదివాసీ సంఘాల నాయకలు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు మంగళవారం కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో సప్తార్ అలీకి వినతిపత్రం అందించారు. సాలేగూడ పాఠశాల పాత భవనం శిథలావస్థలో ఉండి ప్రమాదకరంగా ఉందని, చదువుకునే పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు.
ప్రమాదం పొంచి ఉందని, వెంటనే పాత భవనం కూల్చి వేయాలని కోరారు. లేకుంటే గ్రామస్తులు అంతా కలిసి చందాలు వేసి కూల్చివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు సిడం గణపతి, పెంద్రం ప్రభాకర్, పెంద్రం శ్రీనివాస్, సిడం శంకర్, సిడం జైతు, కుడ్మెత రవీందర్, కిరణ్, ఆడె రాంచందర్, జలపతి తదితరులు పాల్గొన్నారు.