కాసిపేట, అక్టోబర్ 8: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు యం. ఆర్జున్, జి. వికాస్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
నెట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో ఎంపికైన విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్, వ్యాయమ ఉపాధ్యాయుడు పి. శ్రీనివాస్ గౌడ్, పాఠశాల సిబ్బంది అభినందించారు.