Thanduru | అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి : జాడి పోశం
అంబేడ్కర్ ప్రజలందరికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఆపద్భాందవుడని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.
తాండూర్, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ప్రజలందరికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఆపద్భాందవుడని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు జాడి పోశం ఆధ్వర్యంలో మంగళవారంఅంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పంచశీల పతాకావిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ కళలుగన్న సమాజ నిర్మాణం కోసం, నిమ్నజాతి వర్గాలు నిరుపేదల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మండలంలోని వివిధ గ్రామాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అచ్ఛలాపూర్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదారంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ఉపాధ్యక్షుడు దుర్గం గంగారాం, కార్యదర్శి దుర్గం లక్ష్మినారాయణ, సీనియర్ నాయకులు దుర్గం శ్రీనివాస్, గౌర్లపెల్లి విజయ్, అంబేద్కర్ సంఘం నాయకులు, పలువురు సర్పంచులు, అన్ని పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

