ఖాళీ క్వార్టర్స్‌ను రెవెన్యూ శాఖకు అందజేయండి : విప్ బాల్క సుమన్
మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్‌ను పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందజేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ప్రభుత్వ విప్ బాల్క సమన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సీఎండీ శ్రీధర్‌తో బాల్క సుమన్ సమావేశమయ్యారు.
జీవో -76లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో గతంలో చేసిన సర్వేలో పలు కారణాల వల్ల మిస్సయిన భగత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్, జవహర్ నగర్, శ్రీనివాస్ నగర్, మల్లికార్జున నగర్, గంగా కాలనీ, విద్యానగర్, ఆర్కే 4 గడ్డ, పోస్ట్ ఆఫీస్ లైన్ లకు చెందిన భూముల క్రమబద్ధీకరణ చేసేందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
అలాగే మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా సింగరేణి అధికారులు చొరవ చూపాలని, శ్రీధర్ దృష్టికి విప్ సుమన్ తీసుకెళ్లారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

