దండేపల్లి, ఏప్రిల్ 2 : బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు. పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను దండేపల్లి మండల గౌడ సంఘం అధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి గౌడ సంఘం మండల అధ్యక్షుడు బండి రవి గౌడ్ పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం కోసం పాపన్న గౌడ్ ఉద్యమించిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న బాటలో బహుజనులు ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు పుల్ల లక్ష్మీ నారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు పోడేటి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బోమ్మగోని రమేష్ గౌడ్, దండేపల్లి గ్రామ అధ్యక్షుడు తాళ్ల కుమారస్వామి గౌడ్, గౌరవ సలహాదారుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ నారాయణ గౌడ్, నాయకులు గాజుల సత్యగౌడ్, తిరుపతి గౌడ్, చంద్రగౌడ్, మల్లగౌడ్ పాల్గొన్నారు.