కాసిపేట, అక్టోబర్ 3 : రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ సూచించారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్ గనిపై నూతనంగా 3ఎస్-13, 4ఎస్ 13 రెండు డిస్ట్రిక్ట్ కు అండర్ గ్రౌండ్లో నూతనంగా పనులకు అనుమతులు రావడంతో శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం ఎన్ రాధా కృష్ణ పనులను ప్రారంభించారు. ఉత్పత్తి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై పనులను పరిశీలించారు.
ఉత్పత్తి, ఉత్పాదకతలను, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సింగరేణికి మంచి పేరు తీసుకురావడంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
కాసిపేట గని ఎన్నో రికార్డులను సృష్టించిందని, మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఉద్యోగులు పనిచేయాలన్నారు. సరైన పని ముట్లను ఉపయోగించి, నైపుణ్యతతో పని చేయాలన్నారు. ఉద్యోగులలో గైర్హాజరు శాతం ఎక్కువగా ఉందని, వారు సక్రమంగా విధులు నిర్వహించి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. విధులకు రాకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన పోతామని, దీని వల్ల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి గ్రూప్ ఏజెంట్ డి.రాంబాబు, మేనేజర్ డి. సతీష్, రక్షణాధికారి నిఖిల్ అయ్యర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సర్వేయర్ ప్రభాకర్, ఇంజనీర్ రామకృష్ణ తదితరులున్నారు.