కాసిపేట, సెప్టెంబర్ 9 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌తో పాటు ముత్యంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ వసతి గృహంలో మధ్యాహ్న భోజన సమయంలో సందర్శించి భోజనం రుచి చూశారు. కొంత మంది విద్యార్థులను స్వయంగా హాస్టల్ సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ వసతి గృహ కేర్ టేకర్ కు పలు సూచనలు చేశారు. హాస్టల్ కు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఒక ఏఎన్ఎంకు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ జాయిన్ అవ్వకపోవడంతో ఆ పోస్టును త్వరలో ఇంకొకరితో భర్తీ చేస్తామన్నారు. డీఈవో వెంట మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఉన్నారు.