Kasipeta | అటవీ శాఖ ఆధ్వర్యంలో పంట నష్ట పరిహారం చెల్లింపు : పూర్ణ చందర్
అడవి పందుల వలన పంట నష్టపోయిన రైతులకు అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించిన్నట్లు బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజర్ పూర్ణ చందర్ తెలిపారు.
కాసిపేట, ఫిబ్రవరి 4 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బెల్లంపల్లి రేంజ్ ముత్యంపల్లి అటవీ సెక్షన్లో అడవి పందుల వలన పంట నష్టపోయిన రైతులకు అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించిన్నట్లు బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజర్ పూర్ణ చందర్ తెలిపారు. గత నవంబర్, డిసెంబర్ నెలలో కాసిపేట మండలం మల్కెపల్లి, చింతగూడ గ్రామాల్లో అడవి పందుల దాడిలో రైతుల పంట నష్టం కాగా వివరాలను అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదికనుపై అధికారులకు పంపారు.
అధికారులు 10 మంది రైతులకు రూ.36,137 వారి బ్యాంక్ ఖాతాలో నష్ట పరిహారాన్ని జమ చేసినట్లు అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అటవీ జంతువుల నుండి పంట రక్షణ కోసం సోలార్ ను వాడాలని, విద్యుత్ వైర్లు పెట్టకూడదని, అటవీజంతులకు హాని కలిగించకూడదన్నారు. పంట నష్టం జరిగిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

