Kasipeta | చెరువును తలపిస్తున్న కాసిపేట ప్రధాన రోడ్డు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.
కాసిపేట, జూన్ 24 : అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు గుంతల్లో భారీగా వరద నీరు చేరి ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది. వర్షపు నీరు అంతా రోడ్డుపై చేరి చిన్న చెరువును తలపిస్తుంది.
ఇబ్బందుల మధ్య రహదారిపై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
కేవలం ఒక్కరోజు రాత్రి కురిసిన వర్షానికి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే ముందు ముందు రాబోయే వర్షాలకు ఏలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని సార్లు రోడ్డు కోసం ఆందోళనలు చేసిన పట్టించుకునే దిక్కు లేక అద్వానపు రహదారితో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డను మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

