తాండూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానిని ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కేంద్రంలో నిరసన తెలిపారు. సిబిఐ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు. గోదావరి జలాలను వేరే ప్రాంతానికి తరలించేలా పాలక ప్రభుత్వం సన్నాహలు చేస్తుందని దానిపై ఆరోపణలు చేసినందుకే ఇలాంటి తప్పుడు నివేదికలు పంపి తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తమూర్తి, నాయకులు పూసాల ప్రణయ్ కుమార్, దత్తాత్రేయరావు, ఎలుక రామ్ చందర్ మాసాడి శ్రీరాములు, బోనగిరి చంద్రశేఖర్, మద్దిబోయిన అర్జున్, జాడి పోశం, అబుసాదు, బాబు ఖాన్, హనీఫ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.