తాండూర్, ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తాండూర్ ఐబీలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రానుందని తెలిపారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.