Kasipeta Dogs Attack | కాసిపేట, సెప్టెంబర్ 9 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5వ తేదీన చొప్పరి అక్షిత అనే 1వ తరగతి చిన్నారిపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో మంగళవారం బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేష్ బాలిక ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కుక్కల దాడి ఘటనపై సీరియస్గా తీసుకొని సుమోటో కేసుగా స్వీకరించి మంచిర్యాల జిల్లా కలెక్టర్, మండల పంచాయతీ అధికారి, ముత్యంపల్లి పంచాయతీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుమోటో కేసు విషయమై ముత్యంపల్లిలోని చిన్నారి ఇంటికి వెళ్లిన జడ్జి ముకేష్ జరిగిన సంఘటన వివరాలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు.
దాడి విషయమై చిన్నారి అక్షిత, తల్లితోపాటు స్థానికంగా ఉన్న వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు. బాలికకు శరీరం, తలకు తీవ్రగాయాలు కాగా బాలిక తల్లి జరిగిన వివరాలను జడ్జికి తెలిపారు. స్థానికులు కూడా కుక్కల బెడదపై జడ్జికి వివరించారు. ముందుగా జడ్జిని చూడగానే గాయాలైన చిన్నారిని చూపిస్తూ తల్లి విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది. కుక్కల బెడద, నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలకు ముప్పుకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమోటో కేసు నమోదు చేసినట్లు, మంగళవారం లీగల్ సర్వీసెస్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొనగా ఎంపీవో, కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు.
సంఘటనపై వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరడంతో సెప్టెంబర్ 12వ తేదీ వరకు పూర్తిగా వివరాలతో హాజరు కావాలని తెలిపారు. స్థానికులు స్పందించి చిన్నారి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం జమ చేసిన రూ.34,000 నగదును స్థానిక యువకులు జడ్జి చేతుల మీదుగా చిన్నారి అక్షిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో కాసీపేట ఎస్ఐ ఆంజనేయులు, న్యాయవాదులు దాసారపు రాజన్న, ఔరగాని రాజన్న, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్, ఉపాధ్యాయులు అందె నాగ మల్లయ్య, స్థానికులు ఉన్నారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్