కాసిపేట, డిసెంబర్ 5 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి శుక్రవారం స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. పోలీస్ బందోబస్త్తో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం 228 పెద్ద బ్యాలెట్ బాక్స్ లు కాసిపేట మండలానికి కేటాయించారు. ఈ మేరకు బ్యాలెట్ బ్యాక్స్ లను కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు.
బ్యాలెట్ బాక్స్ లను ఎంపీడీవో కార్యాలయంలో సీల్ చేసి భద్ర పర్చారు. కాసిపేటలో 14వ తేదీన రెండో దశలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీవో షేక్ సఫ్దర్ అలీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు లక్ష్మయ్య, సీనియర్ సహాయకులు ఆకుల లక్ష్మీ నారాయణ, తిరుపతి పాల్గొన్నారు.