ఎదులాపురం, జనవరి 30 : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు స్మరించుకుంటూ జిల్లా యంత్రాం గం నివాళులర్పించింది. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి చాంబర్లో సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే ధృడ సంకల్పంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఎస్వో కిరణ్ కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఈడీఎం రవికుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు రాంరెడ్డి, నలంద ప్రియా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అశోక్, నవీన్, అధికారులు ఉన్నారు.