టీఆర్ఎస్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన జోగు రామన్న, విఠల్‌రెడ్డికి ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సా యిబాబా ఆలయంలో జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాచకులకు బట్టలు పెట్టి సన్మానించారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిసారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విఠల్‌రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సందర్భంగా సంబురాలు చేసుకున్నారు. అనంతరం విఠల్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్, ఐకేరెడ్డి, విఠల్‌రెడ్డికి మద్దతుగా నా యకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఆదిలాబాద్ రూరల్, జనవరి 27 : టీఆర్ఎస్ పార్టీని జిల్లాలో గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టంచేశారు. పట్టణంలోని శాంతినగర్ సా యిబాబా ఆలయంలో సతీమణి జోగు రమ తో కలిసి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనపై నమ్మకం ఉంచి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధ న్యవాదాలు తెలిపారు. నాయకులు తనపై పె ట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నా రు. జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంందరినీ కలుపుకుంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పనిచేసే వారిని పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆలయం ముందున్న భిక్షగాళ్లకు బట్టలు పెట్టి సన్మానించారు.
అంబరాన్నంటిన సంబురాలు..
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమించడంతో ఉదయం నుంచి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివచ్చారు. జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోగు రామన్నకు తాంసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, మావల జడ్పీటీసీ నల్లా వనిత రాజేశ్వర్, ఎంపీపీ సెవ్వ లక్ష్మి జగదీశ్, నాయకు లు యూనిస్ అక్బా నీ, వెంకట్ రెడ్డి, దుర్గం శేఖర్, సాజిదొద్దీన్, జంగిలి ప్రశాంత్, రామ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్‌రంజానీ, కౌన్సిలర్లు జాదవ్ పవన్‌నాయక్, బండారి సతీశ్, భరత్‌కుమార్, కస్తాల ప్రేమల, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షకార్యదర్శులు స్వరూప, మమత, ఆదిలాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షకార్యదర్శులు కనక రమణ, సోనేరావ్, తిరుమలేశ్, విలాస్, రుక్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.