KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ సర్కార్ పంట కొనక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ (48) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. రైతు పాండురంగ్కు నివాళులర్పించిన కేటీఆర్ వారికుటుంబసభ్యులను ఓదార్చారు. పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
నుగూరే పాండురంగ్ పొన్న గ్రామంలో తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు మే 23న తేదీన సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. హమాలీలకు డబ్బులు చెల్లించిన అనంతరం లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేసింది. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, పది రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదని మనస్తాపంతో పాండురంగ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిందే.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/R5n64uxR0z pic.twitter.com/jyXEqDOFr2
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026