చెన్నూర్, మే 10 : పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూర్ పట్టణంలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. మొదట పట్టణంలో ని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు.
అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పా ల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రే ణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొంటారు.