చింతలమానేపల్లి: పశువులను మేత మేపడానికి తీసుకెళ్లిన యువకుడు వాగులో గల్లంతైన ఘటన చింతలమానేపల్లి మండలంలోని కేతిని సమీపంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్ (18) వాగు అవతల ఉన్న తమ పంట పొలాల్లో పశువులను మేత మేపడానికి తీసుకెళ్లాడు. అవి పంటను తింటుండటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి వాగు దాటేందుకు యత్నించారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు.
ముగ్గురు కష్టంగా ఒడ్డుకు చేరుకోగా, సుమన్ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న తోటి మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామాస్తులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.