రెబ్బెన జూన్ 24: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ మహిళా జిల్లా నాయకురాలు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి శాలువా కప్పి సన్మానం చేశారు.
ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సమావేశం జరగగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ చేతుల మీదుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గా నియామకం అయిన పత్రాన్ని కుందారపు శంకరమ్మ అందుకుంది. ఈ సందర్భం పురస్కరించుకొని మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ని మర్యాదపూర్వకంగా వెళ్లి కలువగా శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానం చేసినట్లు కుందారపు శంకరమ్మ తెలిపారు.