rajura village | ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూలై 24: రాజుర గ్రామ అభివృద్దికి కృషి చేస్తానని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్, బీజేపీ సీనియర్ నాయకుడు అరిగేలా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని రాజుర గ్రామంలో 2 లక్షల రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమస్ట్ లైట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డును త్వరలో బాగు చేపిస్తమని, పోచమ్మ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఇటీవల బోరు వేయడం జరిగిందన్నారు. త్వరలో సోలార్ లైట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దుడిసే అత్మరాం, బొట్టుపల్లి సాంబయ్య, లోనారే జయరామ్, బొట్టుపల్లి గోపాల్, లోనార్ వసంత్ రావు, దుడిసే ప్రకాష్, శ్రీకాంత్, టో0బ్రే గోవింద్ రావు, ఏమజి, లోకండే రాజేందర్, పాలే తులసి రామ్, మోహన్, క్రాంతి, సాంగ్డే పత్రు, చునార్కార్ విజయ్, బోయిరే రవీందర్, రాజేందర్, వినోద్, బొట్టుపల్లి సంజు, సాయి, దర్మాజి తదితరులు ఉన్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు