ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, మార్చి 4: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ వాహనం వెళ్లడంతో దానికింద పడి 14 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ కాపారి తన గొర్రెలను కట్ట మైసమ్మ ఆలయం సమీపంలో రోడ్డు దాటిస్తున్నాడు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి మంచిర్యాల వైపు అతివేగంతో ఓ వాహనం వచ్చింది. అదే స్పీడ్‌తో వాహనాన్ని గొర్రెలపై నుంచి పోనిచ్చారు. దీంతో 14 గొర్రెలు మృతి చెందాయి. ఇది చూసి ఆ కాపరి కన్నీరు మున్నీరుగా విలపించారు. దాదాపు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.