వాంకిడి, ఏప్రిల్ 8 : సేంద్రియ ఎరువులపై మండల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక ఎరువులతో కలిగే అనర్థాలను గుర్తించి సేంద్రియ ఎరువుల వినియోగంపై మగ్గు చూపుతున్నారు. వానకాలం సీజన్ సమీస్తుండటంతో పంట పొలాలకు రైతులు పశువుల పేడను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.
కృత్రిమ ఎరువులు కొనడానికి భారం అవుతున్న ప్రస్తుత తరుణంలో సేంద్రియ ఎరువులను మండలంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు కూడా రైతులు వెనకాడడం లేదు. ప్రస్తుతం ట్రాక్టర్ పశువుల పేడ రూ.3 వేల నుంచి 5 వేల వరకు పలుకుతుంది. ధరసైతం అందుబాటులో ఉండడం, రైతులకు మంచి ఫలితాలు ఇస్తుండంతో దీనికి ప్రధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తున్నది.