రెబ్బెన మే 24: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం మేకలు, కోళ్లు కోసుకొని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
ప్రతి ఆదివారం ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.