బెల్లంపల్లి, డిసెంబర్ 12 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. క్యాంప్ కార్యాలయంలో బీజే పీ పట్టణ ఉపాధ్యక్షుడు, కాకాసేవా సమితి అధ్యక్షుడు కాసర్ల యాదగిరి, వైఎస్సార్ టీపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి న్యాతరి కిరణ్, నెన్నెల మండల ఇతర పార్టీల వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మొత్తం 110 మంది సోమవారం బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి మ రింత కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నెన్నెల మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
నిరుపేదలకు సీఎఆర్ఎఫ్ పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. మన పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి పురుడు పోశారని తెలిపారు. మున్సిప ల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపీపీ గో మాస శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్డు నారాయణ, కొక్కెర చంద్రశేఖర్, గోసిక రమేశ్, బుదాకుర్దు సర్పంచ్ వేముల కృష్ణమూర్తి, బోయపల్లి ఎంపీటీసీ శ్రీదేవి, నాయకులు నూనెటి సత్యనారాయణ, గడ్డం భీ మాగౌడ్, నెలకంటి శ్రీధర్, ఎంబడి సురేశ్, మల్లే శ్, రవితేజ, తిరుపతి అశోక్ పాల్గొన్నారు.