Asifabad Police | ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, ఫిబ్రవరి 18 : మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి మద్యం సేవించి తీవ్రమైన ఎండలో స్పృహ కోల్పోయి నడి రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళ్తున్న ఆసిఫాబాద్ పట్టణ ఎస్ఐ ప్రశాంత్ ఈ దృశ్యాన్ని గమనించారు. వెంటనే కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, సందీప్, మహేందర్ల సహాయంతో సదరు వ్యక్తిని నీడలో కూర్చోబెట్టారు. అతడికి డీహైడ్రేషన్ కాకుండా మంచి నీరు తాగించి మానవత్వం చాటుకున్నారు.
అనంతరం ఎస్ఐ ప్రశాంత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పోలీసుల ఆద్వర్యంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా చలి వేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా తాగి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి పట్ల ఔదార్యం చూపిన పోలీసుల బృందానికి పట్టణ సీఐ రవీందర్ అభినందనలు తెలియజేశారు. సాటి వ్యక్తి పట్ల మానవత్వం చూపిన పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..