Durgadevi | రెబ్బెన, సెప్టెంబర్ 30 : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించడానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
మంగళవారం దుర్గాష్టమి కావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, రెబ్బన మండల నాయకులు, కాగజ్నగర్ డివిజన్ లెవల్ పంచాయతీ ఆఫీసర్ హరి ప్రసాద్ అమ్మవారిని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
Gorati Venkanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
Urvashi Rautela | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా