SP Nithika Panth | కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బీహార్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి వ్యాపారిపై హత్యకు ప్రయత్నం చేసిన నిందితుడు ఫైనల్‌గా పోలీసులకు చిక్కాడు. ఒక పిస్తోల్, ఒక తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించిన వివరాల ప్రకారం బీహార్ నుంచి అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి, బెదిరింపు లేఖలు రాసి హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్టు చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.
కౌటాల పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కౌటాల మండలానికి చెందిన ఒక బాధితుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జూన్ నెల 12వ తేదీన తన ఫెర్టిలైజర్ షాప్ షెట్టర్‌కు.. చంద్రపూర్, మహారాష్ట బస్ స్టాండుకి వచ్చి 50 లక్షల రూపాయలు సాయంత్రం కల్లా ఇవ్వాలని బెదిరించాడని.. ఇట్టి విషయాన్ని పోలీసులకు గానీ ప్రెస్‌కు గానీ తెలిపినచో, తుపాకితో కాల్చి చంపుతామని లేఖ రాసి పెట్టాడని ఎస్పీ తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 09న ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించాడని.. అక్టోబర్ 15న రోజున బాధితుని తమ్ముడు బైకుపై తన ఇంటికి వెళ్తుండగా, మార్గ మధ్యలో లైటు ఫోకస్ మొఖంపై కొట్టి ఆపడానికి ప్రయత్నించగా, ఆపకుండా వెళ్లడంతో, పెద్దగా శబ్దం చేసి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేయగా.. దాని మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాం. నేరస్తుడైన కుర్బంకర్ అజయ్‌ను మంగళవారం ఉదయం ముత్యంపేట క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న కౌటాల పోలీసులు అరెస్ట్ చేసి, నిందితుని వద్ద నుండి ఒక పిస్తోల్, ఒక తపంచా (దేశి కట్ట), రెండు మ్యాగజిన్ లు, 15 చిన్న బుల్లెట్లు (పిస్తోల్‌కు చెందినవి), ఒక పెద్ద బుల్లెట్ (తపంచాకి చెందినది), సెల్ ఫోన్, ఒక బైకు, ఇతర వస్తువులు స్వాధీన పరుచుకున్నారని ఎస్పీ నితిక పంత్ వివరించారు.

Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా