తెలంగాణ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సీఎం 68వ జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా జరుపుకున్నారు. అన్నదానం, సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం, పటాకులు కాల్చడం, పొలాల్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం, హోమాలు, ధాన్యాభిషేకం, నిత్యావసర సరుకులు, పండ్లు, నగదు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. రైతులను సన్మానించగా.. ప్రాజెక్టుల వద్ద ముదిరాజ్‌లు కేక్ కటింగ్ చేశారు. శతమానంభవతి, దీర్ఘాయుష్మాన్‌భవ వంటి నినాదాలు మిన్నంటాయి. సింగరేణి గనులపై కూడా టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు వేడుకలు నిర్వహించారు. మేడారంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేక్ కట్ చేయగా.. చెన్నూర్‌లో విప్ బాల్క సుమన్ సీఎం చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేశారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)

తెలంగాణ అభివృద్ధి ప్రదాత, జన హృదయనేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దుర్గానగర్ హరితవనంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కేక్‌కట్ చేశారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్‌లోని గిరివికాసంలో పిల్లలతో కలిసి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సర్పంచ్ మీనాక్షీ గాడ్గే ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో హోమం నిర్వహించారు. దళితబస్తీ లబ్ధిదారులు వాగ్మారే చంద్రకాంత్, భాగ్యశ్రీ దంపతులు తమ కుమారుడికి కేసీఆర్‌గా నామకరణం చేశారు. అనంతరం దళితబస్తీ లబ్ధిదారులు 30 మంది తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సీఎం కేసీఆర్‌కు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడారంలోని పర్యాటక శాఖ గెస్ట్‌హౌజ్‌లో కేక్ కట్ చేశారు. సమ్మక్క-సారలమ్మ దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, మథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి భైంసాలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం భైంసాలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. బాసర అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. నిర్మల్ మంత్రి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మొక్కలు నాటారు. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు వద్ద గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడిలో వివిధ గ్రామాలకు చెందిన 50 మంది రైతులను శాలువాలతో సత్కరించారు.
