లక్ష మందితో సీఎం సభ
సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
- వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి నిర్మల్ రాక
- పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అల్లోల
- పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి అల్లోల కలెక్టర్ వరుణ్‌రెడ్డి, అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బహిరంగ సభా స్థలం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 2 వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్నారని, ఆయిల్ పామ్ ఇండస్ట్రీతోపాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
– నిర్మల్ అర్బన్, మే 28
నిర్మల్ అర్బన్, మే 28 : సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, అధికారులతో కలిసి నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బహిరంగ సభ నిర్వహించే స్థలం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లపెల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్డులోని అనువైన స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తొమ్మిదేండ్లుగా ప్రజలకు అందుతున్న వివిధ పథకాలపై కేసీఆర్ ప్రసంగిస్తారన్నారు.
కేసీఆర్ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చా రు. జూన్ 2వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని, రూ.166 కోట్లతో కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అలాగే ఇంజినీరింగ్ కళాశాలను కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. రూ.30 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ భవనాన్ని నిర్మించుకున్నామని, జూలైలో విద్యార్థులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్నారని, ఆయిల్ పామ్ ఇండస్ట్రీతోపాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, అల్లోల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

