బేల : బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో ఆలయాలకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ( KCR ) దక్కుతుందని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) అన్నారు. బేల మండలం సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ. 21 వేలను అందజేశారు. ఆలయాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు.
ప్రభుత్వ నిధులు ఆలయాలకు కేటాయించడం కేసీఆర్‌కే మాత్రమే సాధ్యమైందని కొనియాడారు. సనాతన హిందూ ధర్మాన్ని మరింత ప్రజలకు చేరువ చేస్తూ యాగాలతో పాటు యజ్ఞాలు చేశారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ, శాంతి స్థాపనతో పాటు మానసిక ప్రశాంతతను అలవర్చు కోవచ్చన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రవుత్ మనోహర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీష్ పవర్, విపిన్, మాస్క్ తేజీరావు, బాల్ చoదర్, దేవన్న, దీపక్ గౌడ్ , సురేష్, తదితరులు పాల్గొన్నారు.