కాసిపేట, అక్టోబర్ 17: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ సునీల్ కుమార్‌కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా గొడిసెల క్రాంతి మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం దారుణమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి, గ్రామ అధ్యక్షులు గొడిసెల కుమార్, ఆరుణ్, సీనియన్ నాయకులు గొడిసెల బుగ్గ రాజు, లంక లక్ష్మణ్, ఉప్పులేటి తిరుపతి, చొప్పదండి ప్రణయ్, సురేందర్, ఆజయ్ తదితరులు పాల్గొన్నారు.