తాంసి, ఏప్రిల్ 12 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. పాలోడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి శనివారం జామిడి గ్రామంలో ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి చేరుతున్నారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై 16 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ వినోద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, మాజీ సర్పంచ్ స్వప్న, మాజీ ఎంపీటీసీలు మహేందర్, మలపతి అశోక్, నాయకులు సైకే అశోక్, రజినీకాంత్‌రెడ్డి, గండ్రత్ అశోక్, సిరిసిరి లక్ష్మిపతి, ఉత్తం, భూమన్న, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.