ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తం గా 25 సెంటర్లను ఏర్పాటు చేయగా, మొదటిరోజు పరీక్షకు 484 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
- మంచిర్యాల జిల్లాలో 6711 మంది విద్యార్థులు
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తం గా 25 సెంటర్లను ఏర్పాటు చేయగా, మొదటిరోజు పరీక్షకు 484 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. విద్యార్థులను సిబ్బం ది పూర్తిస్థాయిలో తనిఖీ చేసి సెంటర్లలోకి పంపించారు.
ఆలస్యంగా రాక.. విద్యార్థికి నో ఎంట్రీ

మంచిర్యాల పట్టణంలోని ఎస్ఆర్ కాలేజీలో ఏఈటీ ( ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్) కోర్సు చదివే సుందిళ్ల కార్తీక్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్‌కు ఉదయం 9.20 గంటలకు చేరుకున్నాడు. 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో కార్తీక్‌ను ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవికుమార్ పరీక్షకు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ ఎస్పీ రవీందర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో శైలజ తెలిపారు.
పరీక్షా కేంద్రం తనిఖీ
నస్పూర్,ఫిబ్రవరి 28 : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ ఆదర్శ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ తనిఖీ చేశారు. అనంతరం డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి మిమ్స్ జూనియర్ కళాశాలలో కేంద్రాన్ని తనిఖీ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 28: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని పీటీజీ సెంటర్, కాగజ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ ను కలెక్టర్ బోరడే హేమంత్, రెబ్బెన జూనియర్ కళాశాల లో కేంద్రాన్ని డీఐఈవో నైతం శంకర్, డెక్ సభ్యుడు రాజయ్య, స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎస్పీ సురేశ్ కుమార్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా జనరల్ 4,745, ఒకేషనల్ 880 మొత్తం 5,625 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇందులో జనరల్ 4,521, ఒకేషనల్ 798 మంది హాజరు కాగా, 306 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి నైతం శంకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రా ల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించినట్లు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేరొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

