SLvIND: పడిక్కల్ హాఫ్ సెంచరీ మిస్.. 4 వికెట్లు కోల్పోయిన ఇండియా
SLvIND: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 4వ రోజు భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 116 రన్స్ చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ప్రస్తుతం 294 రన్స్‌కు చేరుకున్నది. పడిక్కల్ 44 రన్స్ చేసి నిష్క్రమించాడు.
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు(SLvIND) రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్సయ్యాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను ఔటయ్యాడు. ఇండియన్ టాపార్డర్‌లో ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ డకౌట్ కాగా, రాహుల్ 35, పడిక్కల్ 44, గిల్ 8 రన్స్ చేసి నిష్క్రమించారు. కెప్టెన్ శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్‌తో విఫలమయ్యాడు. గిల్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 రన్స్ మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పంత్, జురెల్ ఉన్నారు. ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు భోజన విరామ సమయానికి 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా ఆధిక్యం 294 రన్స్‌కు చేరుకున్నది.
It’s Lunch on Day 4 of the Galle Test!
Rishabh Pant (21*) and Dhruv Jurel (5*) in the middle as #TeamIndia move to 116/4 & lead Sri Lanka by 294 runs.
We will be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/WHXkfnivbw#SLvIND pic.twitter.com/0HyMMtu8Tf
— BCCI (@BCCI) August 18, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

