Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. సెన్సార్ సమస్యలు మరియు వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 23న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) సంస్థ అధికారికంగా ఓటీటీలోకి తీసుకువస్తోంది.
ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ సినిమా జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక వెల్లడించారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి ఈ డిజిటల్ ప్రీమియర్ అందుబాటులోకి రానుంది. అయితే, హిందీ వెర్షన్ మాత్రం కొద్ది వారాల తర్వాత స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో పాటు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సయిన అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Thangamey! Thalapathy #Jananayagan is all set to meet you all on 21st August only on Zee 5🔥
The Hon’ble Chief Minister @actorvijay @TheKVNofficial @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries… pic.twitter.com/4mwfq7fDcS
— Zee 5 Tamil (@ZEE5Tamil) August 17, 2026