Peddi Sudarshan Reddy | రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా దివంగత తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట(Narsampeta) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) విగ్రహాన్ని తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమకారుడి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక్కడితో ఆగని పోలీసులు వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసుల మోహరించారు. దీనిపైబీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దమనకాండా? విగ్రహాన్ని(Peddi statue )దొంగచాటుగా తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ చెరిపివేయలేరు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ముదస్తు అరెస్టలు చేస్తున్నారు.పెద్ది విగ్రహాన్నితొలగించడంతో ప్రజల్లో ఆందోళనలు పెళ్లుబికుతాయని గుర్తించిన ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, నన్నపనేని నరేందర్ సహా ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు, విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధం చేశారు.
రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు!
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట.… pic.twitter.com/g70W8CcCrn
— BRS Party (@BRSparty) August 18, 2026