Congress leaders | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ(PAC) సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ముందే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి(Congress leaders) గొడవపడ్డారు. మంత్రి సమక్షంలోనే బాడకావ్ అంటూ సదరు కాంగ్రెస్ నాయకులు బూతులు తిట్టుకోవడంతో నివ్వెరపోవడం మంత్రి వంతయింది. పీఏసీ సమావేశానికి అల్లూరి సంజీవరెడ్డి ఎలా హాజరు అవుతాడని కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను సముదాయించారు.
పంచాయితీ కాస్తా హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో ఇరువురికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి హెచ్చరించారు.
మంత్రి జూపల్లి ముందే బాడకవ్ అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్ నాయకులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ సమావేశంలో మంత్రి జూపల్లి ముందే గొడవపడ్డ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి
సమావేశానికి అల్లూరి సంజీవరెడ్డి ఎలా… pic.twitter.com/8s4B8YlvIx
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2026